HomeMovie NewsKanguva Fire Song పవర్ఫుల్ గా 'కంగువ' 'ఫైర్' సాంగ్

Kanguva Fire Song పవర్ఫుల్ గా ‘కంగువ’ ‘ఫైర్’ సాంగ్

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా శివ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అక్టోబర్ 10న భారీ ఎత్తున పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఇక నేడు సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఫైర్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ అద్బుతంగా ఆలపించిన ఈ సాంగ్ ని శ్రీమణి రచించారు. ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల, వీర జ్వాల, దైవ జ్వాల, దావాగ్ని జ్వాల అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ముఖ్యంగా యుద్ధవీరుడిగా సూర్య మేకోవర్, అలానే విజువల్స్ తో పాటు ప్రేమ్ రక్షిత్ అందించిన స్టెప్స్ ఈ పవర్ఫుల్ సాంగ్ అందరినీ ఆకట్టుకునేలా చేసాయి. ప్రస్తుతం ఫైర్ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. మరి రిలీజ్ అనంతరం కంగువ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

See also  Karthi in Surya Kanguva సూర్య 'కంగువ' లో కార్తీ బ్లాస్ట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories